కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తుది జాబితా రెడీ !

ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. ఇప్పటికే తుది జాబితా రెడీ అయింది. ఒకట్రెండు రోజుల్లోనే విస్తరణ ఉంటుందని సమాచారమ్. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కేవారిలో జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌), శర్వానంద్‌ సోనోవాల్‌ (అస్సాం)లతో పాటు బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

బిహార్‌, గుజరాత్‌ల ఇన్‌ఛార్జిగా ఉన్న భాజపా సీనియర్‌ నేత భూపేంద్ర యాదవ్‌కు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు కీలక ప్రాధాన్యం ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రం నుంచి వరుణ్‌ గాంధీ, రాంశంకర్‌ కథేరియా, అనిల్‌ జైన్‌, రీటా బహుగుణ జోషి, జాఫర్‌ ఇస్లాంల పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌ నుంచి జగన్నాథ్‌ సర్కార్‌, శంతను ఠాకూర్‌, నీతీట్‌ ప్రామాణిక్‌లకు; ఉత్తరాఖండ్‌ నుంచి అజయ్‌ భట్‌, అనిల్‌ బలూనీల్లో ఒకరికి అవకాశం ఉంటుందని తెలిసింది.

కర్ణాటక నుంచి ప్రతాప్‌ సిన్హాకు కూడా అవకాశం దక్కొచ్చని సమాచారం. అశ్వనీ వైష్ణవ్‌ లేదా బైజయంత్‌ పాండా (ఒడిశా), బ్రిజేంద్ర సింగ్‌ (హరియాణా), రాహుల్‌ కస్వాన్‌ (రాజస్థాన్‌), పర్వేశ్‌ వర్మ లేదా మీనాక్షి లేఖి (దిల్లీ)లకు కూడా చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి నారాయణ్‌ రాణె, ఉదయన్‌రాజే భోస్లేలతో పాటు పూనమ్‌ మహాజన్‌ లేదా ప్రీతమ్‌ ముండేల్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.