రవిశాస్త్రి తర్వాత ద్రవిడే కోచ్

టీమిండియా కోచ్ రవిశాస్త్రీ ఒప్పందం ముగింపునకు వస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కోచ్ ఎవరు ? అనే చర్చ మొదలైంది. ఇంకెవరు ? రాహుల్ ద్రావిడ్ నే అంటున్నారు మాజీలు. శాస్త్రీ తర్వాత టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అవుతారని మాజీ క్రికెటర్‌ రీతిందర్‌ సోధి అన్నారు. 

శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు అతడు కోచ్‌గా వెళ్లడమే ఇందుకు సూచన అన్నారు. అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అద్భుతమైన ప్రగతి సాధించారని రితీందర్‌ తెలిపారు. ఒక దిగ్గజ క్రీడాకారుడు తాత్కాలిక బాధ్యతలకు మాత్రమే పరిమితం కావొద్దని రితీందర్‌ పేర్కొన్నారు.