ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై రాజమౌళి కంప్లైంట్
దర్శకధీరుడు రాజమౌళి తన సినిమా పనులని తప్ప పెద్దగా వేటిని పట్టించుకోడు. ఇప్పటి వరకు ఎవరిపైనా, ఏ వ్యవస్థపైనా ఫిర్యాదు చేసింది. తొలిసారి జక్కన్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో సదుపాయాలు సరిగ్గాలేవని ట్విట్ చేశారు.
“అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి ఏమీ బాలేదు.
ఇటువంటి వాటి కోసం చిన్న టేబులైనా ఏర్పాటు చేయాల్సింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి” అని రాజమౌళి ట్వీట్ చేశారు.
Dear @DelhiAirport,
arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passenges are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service.— rajamouli ss (@ssrajamouli) July 2, 2021