సొంత పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్
తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై యుద్ధం ప్రకటించారు. వారి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాడతామని ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. టెక్నికల్ గా ఇప్పటికీ వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో వారికి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను రాళ్లతో కొట్టాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.