ఇన్‌స్టాలో కోహ్లీ.. ఒక పోస్టుకు రూ.5 కోట్లు !

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్‌-20లో నిలిచాడు. ఇన్‌స్టాలో ఒక పోస్టుకు అతడు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలిసింది. హాపర్‌హెచ్‌క్యూ 2021 అనే సంస్థ ఈ మధ్యే ‘ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌’ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ద్వారా ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న ప్రముఖుల పేర్లను వెల్లడించింది.

ఇందులో పుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు, హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. భారత కరెన్సీ ప్రకారం వీరిద్దరూ ఒక్కో పోస్టుకు రూ.11 కోట్లకు పైగా తీసుకుంటున్నారట. పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండె మూడో స్థానంలో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌’లో టాప్‌-20లో నమోదైన ఏకైక క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమే. 19వ స్థానంలో ఉన్న అతడు ఒక్కో పోస్టుకు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు