మహిళలపై డీకే అనుచిత వ్యాఖ్యలు

ఇటీవలే వ్యాఖ్యాతగా కెరీర్ ఆరంభించిన సీనియర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్, టీమ్‌ఇండియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో డికె తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నాడు. వ్యాఖ్యతగా ఇదే అతనికి తొలి మ్యాచ్. తొలి మ్యాచ్ లోనే నోరు జారాడు. బ్యాట్లను పరాయి పురుషుల భార్యలతో పోల్చాడు. ఇప్పుడు.. ఇదే వివాదాస్పదంగా మారింది.

“బ్యాట్స్‌మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేవి రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి” అని దినేశ్ వ్యాఖ్యానించాడు. దీనిపై క్రికెట్ ప్రేమికుకు మండిపడుతున్నారు. డికె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.