ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్.. గంటకు 300కి.మీ వేగం

గాల్లోనూ ట్రాఫిక్ జామ్ అయ్యే రోజులు రాబోతున్నాయా ? రోడ్ల మీద తిరిగే కార్లు ఆకాశంలో ఎరగనున్నాయా ? అంటే అవుననే అంటున్నారు.  స్లొవేకియాలో ఎగిరే కారు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయింది. నిత్రా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కారు దాదాపు 8 వేల ఎత్తుకు ఎగిరి.. రాజధాని బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది.

ఈ కారు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. ఈ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించగలరు. 2.15 నిమిషాల్లోనే విమానంగా మారిపోయే ఈ కారు తయారీకి రెండేళ్ల సమయం పట్టిందట. భవిష్యత్ లో ఇలాంటి కార్లే విమానాల్లా మారి.. సామాన్యుడి అవసరాలని తీరుస్తాయని అనడంలో సందేహం లేదేమో.. !