ప్రేమ, ముద్దు, శృంగారంతో ఇబ్బంది టీనేజ్ నుంచే.. : తాప్సీ

తాప్సీ – టాలీవుడ్ మిస్ చేసుకున్న అద్భుత నటి. బాలీవుడ్ కి దొరికిన మరో కంగనా. విభిన్న సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ గుర్తుంపు తెచ్చుకుంది.. ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హసీనా దిల్‌రుబా’. వినీల్‌ మాథ్యూ దర్శకత్వం వహించారు. విక్రాంత్‌, హర్షవర్థన్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా శుక్రవారం విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. ఎప్పటిలాగే తాప్సీ అదరగొట్టేసిందని చెప్పుకుంటున్నారు.

ఈ  సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న తాప్సీ మాట్లాడుతూ..  “సినిమా షూట్‌ ఎంతో సరదాగా సాగిందని.. కాకపోతే ముద్దు, శృంగార తరహా సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఇబ్బందిపడ్డాం. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇబ్బంది ఉండేది. మా నాన్నకు హాలీవుడ్‌ సినిమాలు చూడడమంటే ఇష్టం. దాంతో ఇంట్లో ఉన్న వాళ్లందరూ నాన్నతోపాటు కూర్చొని అవే సినిమాలు చూసేవాళ్లం. కానీ ఆ సినిమాల్లో ప్రేమ, ముద్దు సన్నివేశాలు వస్తే.. టీవీ ముందు కూర్చున్న మేమంతా కాస్త ఇబ్బందికి గురయ్యేవాళ్లం. దాంతో, ఇంట్లో పెద్దవాళ్లు.. మంచినీళ్లు తీసుకురమ్మని నన్ను కిచెన్‌లోకి పంపించేసేవాళ్లు” అని చెప్పుకొచ్చారు.