కొత్త నియోజకవర్గానికి మారనున్న రేవంత్ రెడ్డి !
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో తన నియోజకవర్గాన్ని కొడంగల్ నుంచి ఎల్బీ నగర్ కి మారాలనే ప్లాన్ లో ఉన్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని ఓడించాలని టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నించింది. విజయవంతం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొడంగల్ లో రేవంత్ ఓటమికి తెరాస ఆ రకమైన ప్లాన్ నే చేయొచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ అలర్ట్ అయ్యారట.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఎల్బీ నగర్ నుంచి పోటీ ఉండబోతున్నారట. కొడంగల్ నియోజకవర్గం మొత్తం మూడు జిల్లాలో ఉంటుంది. దానిపై పట్టు సాధించడం అంత ఈజీ కాదు. పైగా టీపీసీసీ అధ్యక్షుడిగా హైదరాబాద్ దగ్గరల్లోనే తన నియోజకవర్గం ఉంటే.. అనువుగా ఉంటుందని రేవంత్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎల్బీ నగర్ పై ఫోకస్ పెట్టారు. అక్కడి సమస్యలపై పోరాటం చేయనున్నారు. ప్రజలకు దగ్గర కానున్నారని చెబుతున్నారు.