మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్.. కారణాలు ఏంటంటే ?

నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్ల జాబితాలో మెహ్రీన్ కూడా చేరిపోయింది. రాజకీయనాయకుడు భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి అన్నారు. ఇంతలో పెళ్లి మెహ్రీన్ పెళ్లి వేడుకని వాయిదా వేసుకుంది. బాలయ్య సినిమాలో ఆఫర్ రావడమే ఇందుకు కారణమనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్నట్టు మెహ్రీన్ సడెన్ షాక్ ఇచ్చింది.

కాబోయే భర్తకు మెహ్రీన్ బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించింది. ఇద్దరం కలిసి, స్నేహపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం.  ఇకపై భవ్య బిష్ణోయ్ తో కానీ, ఆయన కుటుంబసభ్యులతో కానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవు. అంతేకాదు బిష్ణు స్నేహితులు, చుట్టాలతో కూడా ఎలాంటి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చింది. 

ఇకపై తన తన సినిమాలు, తన పెర్ ఫార్మెన్స్ మీద దృష్టి పెడతానని, అందరూ తన ప్రయివసీని గౌరవిస్తారని భావిస్తున్నా అని మెహరీన్ ట్వీట్ చేసింది. అయితే పెళ్లికి క్యాన్సిల్ కి గల కారణాలు మాత్రం ఆమె చెప్పలేదు. భవ్య బిష్ణోయ్ పెళ్లికి ముందే ఆట్యిట్యూడ్ చూపించాడాని.. అది మెహ్రీన్ కి నచ్చలేదని సమాచారమ్. 

pic.twitter.com/OD2p8ZKOpJ— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021