ఒకేరోజు రెండు బ్రేకప్’లు

ఒక్కరోజే ఇద్దరు సెలబ్రెటీల బ్రేకప్ ప్రకటనలు వచ్చాయ్. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఆమె భార్య కిరణ్ రావు విడిపోయారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఇద్దరూ సంయుక్త ప్రకటన చేశారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పినట్టు ప్రకటన చేసింది.

ఈ రెండు బ్రేకప్ ప్రకటనలు సడెన్ షాక్ లాంటిదే. ఆమీర్ ఖాన్ భార్యకు విడాకులు ఇస్తాడని ఎవరు ఊహించి ఉండరు. ‘లగాన్’ సినిమా టైమ్ లో అమీర్ ఖాన్, కిరణ్ రావుకు పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో 2005 డిసెంబర్ లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2011 డిసెంబర్ లో వాళ్లకు ఆజాద్ రావ్ ఖాన్ పుట్టాడు. అమీర్ ఖాన్ కు కిరణ్ రావు కంటే ముందే రీనా దత్తాతో వివాహం అయింది. వాళ్లకు జునైద్ ఖాన్ అనే కొడుకు, ఐరా ఖాన్ అనే కూతురు ఉన్నారు. ఆమెకు విడాకులిచ్చి కిరణ్ రావును పెళ్లి చేసుకున్న అమీర్.. ఇప్పుడు కిరణ్ రావుతో కూడా విడిపోయాడు.

ఇక రాజకీయనాయకుడు భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి అన్నారు. ఇంతలో పెళ్లి మెహ్రీన్ పెళ్లి వేడుకని వాయిదా వేసుకుంది. బాలయ్య సినిమాలో ఆఫర్ రావడమే ఇందుకు కారణమనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్నట్టు మెహ్రీన్ సడెన్ షాక్ ఇచ్చింది.కాబోయే భర్తకు మెహ్రీన్ బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించింది. అమీర్, మెహ్రీన్ ల బ్రేకప్ ప్రకటనలు ఒకేరోజు.. దాదాపు ఒకే టైమ్ లో విడుదల కావడం విశేషం.