హీరోల రెమ్యూనరేషన్స్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్లో హీరో, హీరోయిన్ల పారితోషికాలపై నెలకున్న వివక్షపై హీరోయిన్ తాప్సీ స్పందించారు. హీరోల రెమ్యునరేషన్‌పై స్పందించని వాళ్లు ఒక హీరోయిన్ పారితోషికం విషయంలో ఎందుకు రచ్చ చేస్తారు ? అంటూ తాప్సీ నిలదీసింది.
“మహిళా నటులు పారితోషికం ఎక్కువగా అడిగితే అదో పెద్ద సమస్యగా తయారవుతుంది. ఇదే ఎవరైనా హీరో రెమ్యునరేషన్ పెంచితే మాత్రం అది ‘అతని సక్సెస్’గా అభివర్ణిస్తారు. నాతో ఇండస్ట్రీలో ఒకేసారి వచ్చిన వాళ్లు ఇప్పుడు నాకంటే 3-4రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. గుర్తింపు విషయంలోనూ అదే వివక్ష. హీరోలకు స్టార్డమ్ వచ్చిన సమయంలో హీరోయిన్లకు గుర్తింపు రావడం లేదు. ఈ వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
ప్రేక్షకులు కూడా పురుష నటులతో పోలిస్తే మహిళా నటులను తక్కువగానే అభిమానిస్తారు. మహిళల ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలకు ఎక్కువగా బడ్జెట్ పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలతో పోల్చితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు రాబడి తక్కువగా ఉంటుందని వాళ్ల భావన. వీటన్నింటికీ ప్రేక్షకులే ప్రధాన కారణం” అని తాప్సీ వాపోయారు.