EURO CUP 2020 ఫైనల్స్ కు ఇటలీ !

యూరోకప్‌ 2020లో ఇటలీ అదరగొడుతోంది. స్పెయిన్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఫెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఇటలీ విజయం సాధించింది. ఫైనల్ లో అడుగుపెట్టింది. మ్యాచ్‌ ముగిసే సమయానికి 1-1తో సమంగా నిలిచిన ఇటలీ, స్పెయిన్‌లు తమకు కేటాయించిన ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం తేల్చాల్సి వచ్చింది.

ఇక రెండో సెమీస్‌ మ్యాచ్‌ భారత కాలమాన ప్రకారం ఈరోజు రాత్రి 12.30 గంటలకు ఇంగ్లండ్‌, డెన్మార్క్‌ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో ఇటలీ ఫైనల్ ఆడనుంది.