కేంద్ర కేబినేట్ : వీరికి ఉద్వాసన.. వారికి ప్రమోషన్ !

ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. మొత్తంగా 12 మంది కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్ జావడేకర్‌, డాక్టర్‌ హర్షవర్దన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌, సదానందగౌడతో పాటు రతన్‌లాల్‌ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజయ్‌ ధోత్రే, రావు సాహెబ్‌ ధన్వే పాటిల్‌, అశ్వినీ చౌబే, బాబుల్‌ సుప్రియోలకు ఉద్వాసనకు గురయ్యారు. వారి రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

అదే సమయంలో మరికొందరు కేంద్ర మంత్రులకు పదొన్నతి లభించింది. జి. కిషన్‌ రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌, హర్‌దీప్‌ సింగ్‌ పూరి, పురుషోత్తం రూపాలా, మనుసుఖ్‌ మాండవీయలను కేబినెట్‌లోకి తీసుకున్నారు. గత రెండేళ్లుగా ఆయా శాఖలో వారి పనితీరుతో పాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీరికి ప్రమోషన్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.