హీటెక్కిస్తున్న బూత్.. బ్యూటీస్ !

సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామి గౌతమ్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ హర్రర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. ఈ చిత్రానికి పవన్ కృపలానీ దర్శకత్వం వహించారు. రమేష్ తౌరాని మరియు అక్షయ్ పూరి నిర్మించారు. #DisneyPlusHotstar ఓటీటీ వేదికగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇప్పటికే సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ ల లుక్స్ ని విడుదల చేసింది.

తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామి గౌతమ్ ల లుక్స్ ని రిలీజ్ చేశారు. జాక్వెలిన్ హాట్ గా కనిపిస్తోంది. ఆమెకు పోటీ ఇచ్చే రేంజ్ లో యామీ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ని చూసి.. బూత్ బ్యూటీస్ హాట్ పోజులతో వచ్చేశారని కామెంట్స్ చేస్తున్నారు. హారర్ కామెడీ చిత్రాల్లో గ్లామర్ ఒకబోత సహజమే. బూత్ పోలీస్ లోనూ బూతు శాతం ఎక్కువే ఉండనుందని హీరోయిన్స్ పోస్టర్స్ తో క్లారిటీ వచ్చేసినట్టయింది.