సీఎం కేసీఆర్ ని కలిసిన ఎల్ రమణ.. కారెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ !
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ ని కలిశారు. భేటీ అనంతరం ఎల్ రమణ స్పందించారు. “నేను సీఎం కేసీఆర్ ని కలిశారు. నన్ను తనతో కలిసి పని చేయాలని ఆహ్వానించారు. సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం కేసీఆర్ కు చెప్పా” అని రమణ తెలిపారు.
ఎల్ రమణ సీఎం కేసీఆర్ ని కలవడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ‘చేనేత బిడ్డ అయిన ఎల్ రమణ అవసరం తెరాసకు ఉంది. తెలంగాణలో తెదేపా నిలబడే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ కు ఎల్ రమణ అంటే అభిమానం. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎల్ రమణ కూడా సానుకూలంగా స్పందించారు” అని అన్నారు.
ఈ నేపథ్యంలో ఎల్ రమణ తెరాసలో చేరడం దాదాపు ఖాయమైనట్టేనని చెబుతున్నారు. ఎల్ రమణ కరీంనగర్ కు చెందిన. అందులో బీసీ నేత. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఎల్ రమణని పార్టీలోకి చేర్చుకుంటే మైలేజ్ పెరుగుతుందనే వ్యూహాంతోనే మంత్రి ఎర్రబెల్లి ద్వారా పావులు కదిపారు. ఆ వ్యూహాం ఫలించింది. రమణ కారెక్కెబోతున్నారని తెలుస్తోంది.