‘కేజీఎఫ్ 2’ కొత్త పోస్టర్.. వైరల్ !

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్‌ నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న ‘కేజీఎఫ్‌-1’  విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ -2’ తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. కరోనా ఉదృతి లేకుంటే ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రబృందం కూడా అతి త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పేస్తామని ఊరిస్తోంది. కానీ చెప్పడం లేదు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది.

ఇక ఈ సినిమా తమిళ హక్కులని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కొనేసింది. రేటు ఎంత అనేది మాత్రం బయటికి పొక్కలేదు. మరోవైపు, సెప్టెంబర్‌ 9న ‘కేజీఎఫ్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే చిత్రబృందం క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది.