కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరింత ఆలస్యం.. ఎందుకంటే ?
కొత్త రేషన్ కార్డులని పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించిన మీదట అర్హులకు కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై సమీక్షించారు. 15 రోజుల వ్యవధిలో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీంతో సోమవారం నుంచి కార్డులు జారీ చేయాలని తొలుత అధికారులు భావించారు. అయితే కొత్త కార్డుల జారీ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
క్షేత్రస్థాయిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని రోజులు ఆగాల్సిందే. కార్డుల కోసం 4,15,901 దరఖాస్తులు అధికారుల వద్ద ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసేందుకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.