నవరస.. ఇది చూపుల రసం !

ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం-నెట్‌ఫ్లిక్స్ తో క‌లిసి ‘నవరస’ వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తొమ్మిది కథలతో.. తొమ్మిది మంది దర్శకులు ఈ వెబ్ సిరీస్ కోసం పని చేస్తున్నారు. కేవీ ఆనంద్, గౌతమ్ మేనన్‌, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, పొన్ రామ్, హలిత షలీమ్, అరవింద్ స్వామి, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. 

రేవ‌తి, నిత్య‌మీన‌న్‌, ఐశ్వ‌ర్య‌రాజేశ్‌, పూర్ణ‌, రిత్విక‌, పార్వ‌తి, తిరువొతు ఫీమేల్ లీడ్స్ లో న‌టించ‌నుండగా.. అర‌వింద్ స్వామి, సూర్య‌, సిద్దార్థ్‌, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌స‌న్న‌, గౌత‌మ్ కార్తీక్ తో పాటు మ‌రికొంత న‌టులు మేల్ లీడ్స్ లో క‌నిపించ‌నున్నారు. ఏఆర్ రెహ‌మాన్, గిబ్రాన్ స‌హా 8 మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. మ‌ణిర‌త్నం-జ‌యేంద్ర పంచ‌ప‌కేశ‌న్-నెట్ ఫ్లిక్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ఓ రసాన్ని వదిలారు. అదే చూపుల రసం. సూర్య, ప్రియా మారిటిన్ ఫస్ట్ లుక్ లని వదిలారు. విడుదల చేసిన రెండు పోస్టర్స్ లోనూ ఇదరు చూపుల్లో మునిగిపోయారు. తథేకంగా చూసుకుంటున్నారు. బహుశా.. నవరసాల్లో ఇదో రసం కావొచ్చేమో. ప్రేక్షకులు మాత్ర ఇది చూపుల రసం అని చెప్పుకుంటున్నారు. ఈ పార్టుకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు.