Euro cup విజేత ఎవరు అవుతారు ?

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 2-1 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్‌లో తొలి నుంచీ ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌ చేసి సమంగా నిలిచాయి. దీంతో ఆట ఆదనపు సమయానికి దారితీసింది. ఆదనపు సమయంలో ఇంగ్లాండ్‌ మరో గోల్‌ చేసి విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టీమ్‌ 10 సార్లు గోల్‌ లక్ష్యం దిశగా వెళ్లింది. అయితే వాటిలో కేవలం రెండింటినే గోల్‌గా మలిచింది. ఇక డెన్మార్క్‌ కేవలం మూడు సార్లు మాత్రమే గోల్‌ చేసే దిశగా వెళ్లింది. ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ ఇటలీని ఢీకొట్టనుంది.