మహేష్ Unseen Still.. వైరల్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తలచుకుంటే అంతే మరీ.. ! క్షణాల్లో ట్రెండ్ సెట్ చేయగలరు. ట్రెండింగ్ లోకి తీసుకు రాగలరు. ఇప్పుడు మహేష్ బాబు అన్ సీన్ స్టిల్ ఒకటి ట్విట్టర్ లో ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. ఇది శ్రీమంతుడు సినిమాలోని స్టిల్. ఇప్పుడీ.. ఈ స్టిల్ ని #SSMBArchiveson9th యాష్ ట్యాగ్ తో వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంక్ దోపిడి నేపథ్యంలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఆయనది సినిమాలో డ్యూయెల్ రోల్ అనే ప్రచారం కూడా ఉంది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఇప్పటికే జక్కన్న స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట. సోషల్ మెసేజ్ నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండనుందని సమాచారమ్.