లాల్ సింగ్ చద్దా : ఆమీర్ తో చైతూ.. అదిరిపోయింది !
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ కథానాయిక. 1994 హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్ గంప్’కి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. తాజా షెడ్యూల్ లో నాగ చైతన్య జాయిన్ అయ్యారు.
గురువారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ లఢక్ లో ప్రారంభం అయింది. తాజాగా సెట్స్ నుంచి ఓ పిక్ ని చిత్రబృందం షేర్ చేసింది. ఆర్మీ డ్రెస్ లో అమీర్ తో పాటు చైతూ కనిపిస్తున్నారు. మెరిసిపోతున్నారు. సినిమాలో అమీర్ ఆర్మీ సహచరుడిగా చైతూ కనిపించబోతున్నాడని ఈ పిక్ తో క్లారిటీ వచ్చింది. తాజా షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుందని సమాచారమ్.
‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ 2019 అక్టోబర్ 31న చంఢీగఢ్‌లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ 2020 మార్చిలో నిలిపివేశారు. కరోనా విజృంభణ తగ్గడంతో తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఇక క్రిస్మస్ కానుకగా సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో చిత్రబృందం ఉంది.