‘నవసర’ టీజర్ వచ్చేసింది

ఇప్పటివరకూ చూడని భారీ తారాగణంతో రాబోతున్న ఆసక్తికర వెబ్‌సిరీస్‌ ‘నవరస’. మణిరత్నం సృష్టికర్తగా రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌ స్వామి, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఇలా తొమ్మిది మంది దర్శకులు 9 భాగాలను తెరకెక్కిస్తున్నారు. మరో దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం నిర్మిస్తున్నారు

హాస్యం, శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, అద్భుతం, వీరం… ఇలా నవరసాలతో కూడిన చిత్రాలు ఇవి. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం నేపథ్యంగా సాగుతుంది. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా టీజర్ ని విడుదల చేసారు. నటీనటుల ఫస్ట్ లుక్ లని పరిచయం చేస్తూ టీజర్ సాగింది. మరి తొమ్మిది కథలు సంగతి ఏంటి? ఎవరు ఏయే పాత్రల్లో అలరించనున్నారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.