తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్
తెలంగాణలో ఆన్ లైన్ సేవలు గురువారం రాత్రి నుంచే నిలిచిపోయాయ్. రాష్ట్ర డేటా సెంటర్‌లో ఐటీ శాఖ కొత్త యూపీఎస్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ప్రభుత్వ వెబ్ సైట్స్ నిలిచిపోయాయ్. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లకు ప్రాతిపదికగా ఉన్న కార్డ్ విధానం, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ సేవలు గురువారం రాత్రి 7 గంటలకే నిలిచిపోయాయి.
శుక్రవారం రోజంతా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సహా ఇతర సేవలు అందుబాటులో ఉండవు. రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో తిరిగి సోమవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.