థర్డ్ వేవ్ పై కేంద్రం అలర్ట్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కానీ త్వరలోనే థర్డ్ వేవ్ విజృంభణ మొదలు కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఓవైపు వ్యాక్సినేషన్‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే నాలుగు లక్షలకు పైగా ఆక్సిజనేటెడ్ పడకలకు ప్రాణవాయువు అందించేందుకు వీలవుతుందని అధికారులు మోదీకి వివరించారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై ఆసుపత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు.