రజనీ ఈజ్ బ్యాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. రొటీన్ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికా వెళ్లిన రజనీ తిరిగి చెన్నై చేరుకున్నారు. ఆయన చెన్నై ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన అభిమానులు తలైవా ఈజ్ బ్యాక్. అన్నాత్తే ఈజ్ బ్యాక్, రజనీ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్ల కిందట రజనీకి అమెరికాలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. అప్పటి నుంచి ప్రతి యేడాది వైద్య పరీక్షల కోసం అక్కడికి వెళ్తుంటారు. ఇందులో భాగంగా గతేడాదే ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యమైంది. దీంతో అన్నాత్తే షూటింగ్ పూర్తయిన వెంటనే రజనీ అమెరికా టూర్ కి వెళ్లారు.

ఆ సమయంలో ధనుష్ కూడా అక్కడే ఉండటంతో.. రజనీని దగ్గరుండి చూసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రజనీ అన్నాత్తై సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ మాత్రం చెప్పాల్సి ఉంది. అమెరికా తిరిగొచ్చిన రజనీ అన్నాత్తె డబ్బింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత కొత్త సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు.