బాలీవుడ్ ‘హిట్’ హీరోయిన్ ఎవరో తెలుసా ?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు బాలీవుడ్ కి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. మన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’గా మారాడు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మన ‘జెర్సీ’ బాలీవుడ్ లో రిమేక్ అవుతోంది. మన ‘హిట్’ కూడా అక్కడికి వెళ్తోంది.

హీరో నాని నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. కొత్త దర్శకుడు సైలేష్ కొలను దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, భాను చందర్ ప్రధాన కీలక పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. 2020, ఫిబ్రవరి 28న రిలీజైన హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇప్పుడీ.. ఈ సినిమా బాలీవుడ్ రిమేక్ లో రాజ్ కుమార్ రావ్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా దంగల్ నటి సన్యా మల్హోత్రాని తీసుకున్నారు. మాతృక దర్శకుడు కొలను సైలేష్ దర్శకత్వం వహించనున్నారు.