ప్రైవసీ పాలసీని నిలిపి వేసిన వాట్సాప్

ప్రైవసీ పాలసీని వాట్సాప్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

“ప్రభుత్వం ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేయమని చెప్పింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చేవరకు మేం దీన్ని అమలు చేయమని చెప్పాం. దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ స్వచ్ఛందంగా అంగీకరించాం. ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే.. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తాం” అని వాట్సాప్ పేర్కొంది.