అలీ ఇంట్లో మటన్ బిర్యానీ.. సూపర్ !

సీనియర్ కమెడియన్ అలీ ‘ఎఫ్3’ చిత్ర యూనిట్ కడుపు నింపాడు. మటన్ బిర్యానీ పెట్టించాడు. అది ఏ హోటల్ నుంచో తెప్పించలేదు. అలీ ఇంట్లోనే చేయించాడు. అలీ ఇంట్లో చేసిన మటన్ బిర్యానీ సూపర్ అంటూ.. ఎఫ్ 3 దర్శకుడు అనిల్ రావిపూడి ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్ లో అలీ, సత్య, శిరీష్ తదితరులు ఉన్నారు. ఈ పిక్ ని చూసి.. ‘చూస్తేనే నోరూరిపోతుంది. ఇక తిట్టే అమోఘం..’ అంటూ నెటిజన్స్ కామెంట్శ్ పెడుతున్నారు.

సూపర్ హిట్ ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సీక్వెల్ లోనూ వెంకీ-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ నటిస్తున్నారు. సునీల్, అనసూయ, అంజలి ఎక్స్ ట్రాగా యాడ్ కానున్నారని తెలుస్తోంది. ఎఫ్ 2ని మించి వినోదం పంచేలా ఎఫ్ 3ని తీర్చిదిద్దితున్నట్టు సమాచారమ్.