జగన్-షర్మిల మధ్య విద్వేషాలు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కామెంట్ !
ఏపీ సీఎం జగన్. ఆయన చెల్లెలు షర్మిల మధ్య గొడవలు ఉన్నాయి. అందుకే షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుంది. అవసరమైతే.. అన్నతో ఢీ కొనేందుకు షర్మిల రెడీగా ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పందించారు.
ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్-షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవన్నారు. అన్నాచెల్లెలు మధ్య విభేదాలున్నాయని వదంతులు సృష్టిస్తున్నారన్నారు. జగన్కు ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు కాదన్నారు. కేసీఆర్ అంటే జగన్కు మంచి అభిమానం ఉందని నారాయణస్వామి చెప్పుకొచ్చారు. మరీ.. అలాంటప్పుడు జల వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు కదా.. ! అని జనాలు అంటున్నారు.