‘ఆచార్య’ నుంచి అదిరిపోయే అప్ డేట్ !

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చరణ్‌ కొత్తలుక్‌ విడుదల చేశారు. ‘ధర్మస్థలి(ఆలయ సెట్‌)కి ద్వారం తెరచుకుంది. చివరి షెడ్యూల్‌లో ఉన్నాం’ అంటూ అప్ డేట్ ఇచ్చారు. అంతేకాదు త్వరలోనే మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉండబోతోందని ప్రకటించారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో.. రామ్ చరణ్ ‘ఆచార్య’కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఆచార్యగా కనిపించనుండగా రామ్‌చరణ్‌ సిద్ధ పాత్ర పోషించాడు. కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Shoot resumes for #Acharya !@KChiruTweets @sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @KonidelaPro pic.twitter.com/sDS7BGzzJz— Ram Charan (@AlwaysRamCharan) July 10, 2021