RRR మేకింగ్ వీడియో వచ్చేస్తోంది

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అప్ డేట్ ని ఇచ్చారు. ఈ నెల 15న #RoarOfRRR పేరిట మేకింగ్ వీడియోని విడుదల చేయనున్నట్టు తెలిపారు. మేకింగ్ వీడియోలో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. సీత పాత్రలో అలియాభట్ నటించింది. తారక్ కి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు మొత్తంగా 13 భాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

#RoarOfRRR – A glimpse into the making of #RRRMovie on July 15th, 11 AM.@ssrajamouli @tarak9999@AlwaysRamCharan @ajaydevgn@aliaa08 @oliviamorris891@RRRMovie @DVVMovies@PenMovies @LycaProductions #OTTRelease pic.twitter.com/s70MCou7xz— OTTRelease (@ott_release) July 11, 2021