రేపే #RT68 ఫస్ట్ లుక్

మాస్ మహారాజా రవితేజ గర్జిస్తే మాములుగా ఉండడు. మాస్ కు పండగే. ‘క్రాక్’తో మరోసారి మాస్ ని మురిపించాడు రవితేజ. ఆ ఊపులోనే ‘ఖిలాడీ’ సినిమాని పూర్తి చేశాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ వెంటనే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు మాస్ మహారాజా. 

కొత్త దర్శకుడు శరత్ దర్శకత్వంలో #RT68 తెరకెక్కుతోంది. రవితేజకు జంటగా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. మజిలీ సినిమాలో నాగ చైతన్య ప్రియురాలిగా కనిపించింది.. ఈ అమ్మాయినే. ఈ సినిమాలో రవితేజ వీఆర్వోగా  కనిపించబోతున్నారు. ప్రీ లుక్ లోనే దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇక రేపు #RT68 ఫస్ట్ లుక్ రాబోతుంది. ఈ అప్ డేట్ ఇస్తూ.. చిత్రబృందం ఓ పోస్టర్ ని షేర్ చేసింది.