‘ఆకాశం నీ హద్దురా’ బాలీవుడ్ రిమేక్ లో అక్షయ్ ?

దక్షిణాది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు బాలీవుడ్ కి వెళ్తుంటాయ్. అక్కడ మేజిక్ ని రిపీట్ చేస్తుంటాయ్. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కథ-కథనాలు గ్రిప్పింగ్ గా సాగాయి. ఓటీటీకి వేదికగా రిలీజైన ఈ చిత్రం మంచి సినిమా అనిపించుకుంది. భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది.

ఇప్పుడీ.. ఈ సినిమాని బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నట్టుప్రకటించారు చిత్రబృందం. సూర్య జ్యోతిక రాజశేఖర్ పాండ్యన్ కలసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ రీమేక్ చిత్రానికి కూడా సుధా కొంగరానే దర్శకత్వం వహించబోతున్నారు. అయితే సూర్య పాత్రలో ఎవరు నటిస్తారు ? అన్నది ఆసక్తిగా మారింది. అక్షయ్ కుమార్ ని సంప్రదించారు. ఆయన కూడా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారమ్.