రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ముమైత్ ఖాన్ !
ఊహించిందే జరిగింది. పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పోతూ.. పోతూ కాంగ్రెస్ పార్టీ, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 50కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కున్నారని ఆరోపించారు. పీసీసీ పదవి రాగానే.. ఏదో సీఎం అయిపోయినట్టు రేవంత్ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ వచ్చి చేతులు ఊపితే.. జనాలు చప్పట్లు కొడతారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముమైత్ ఖాన్ అని సంచలన కామెంట్స్ చేశారు.
అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుందని కౌశిక్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో సీనియర్లు ఎవ్వరూ హ్యాపీగా లేరు. భట్టీ విక్రమార్క్, శ్రీధర్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్.. తదితరులు హ్యాపీగా లేరు. వీరంతా పార్టీ వీడతారనే సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. ఈటెలతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికని రేవంత్ పట్టించుకోవడం లేదన్నారు. మొత్తానికి.. పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి రేవంత్ రెడ్డిని రేప్ చేసినంత పని చేశాడు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానని కౌశిక్‌రెడ్డి అన్నారు.
మరోవైపు ఇప్పటికే హుజూరాబాద్ తెరాస టికెట్ కౌశిక్‌రెడ్డి కి ఖరారైనట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ తెరాస టికెట్ తనకే దక్కిందని కౌశిక్‌రెడ్డి మాట్లాడిన ఓ ఆడియో టేప్ లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో టేప్ లీకై 12గంటలు కూడా గడవక ముందే కౌశిక్‌రెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం విశేషం.