హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి.. ఆడియో లీక్ !
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి.. టీఆర్ఎస్ పథనానికి నాంది పలకాలని బీజేపీ భావిస్తోంది. తనని ఘోరంగా అవమానించి, అక్రమ కేసులు మోపి.. పార్టీ నుంచి బయటికి పంపినందుకు బదులు తీర్చుకోవాలనే కసితో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నారు. హుజూరాబాద్ భాజాపా అభ్యర్థిగా ఈటెల ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఆయన కంటే ముందే టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలని అమలు చేస్తోంది. కానీ ఆ పార్టీ అభ్యర్థి ఎవరు ? అన్నది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
గత ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఈటెలపై స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన కౌశిక్ రెడ్డిని టీఆర్ ఎస్ లో చేరబోతున్నారు. ఆయనకే హుజూరాబాద్ టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రచారం నిజమైంది కూడా. హుజూరాబాద్ తెరాస టికెట్ తనకు దక్కిందని స్వయంగా కౌశిక్ రెడ్డి రెడ్డి చెప్పిన ఓ ఆడియో లీకైంది.
టీఆర్ఎస్ సోషల్ మీడియాని మేనేజ్ చేసే ఓ వ్యక్తికి ఫోన్ చేసిన కౌశిక్ రెడ్డి.. తనకు హుజూరాబాద్ టికెట్ ఖరారైంది. తన గెలుపు సహకరించాలి. డబ్బులు కావాలంటే నేను చూసుకుంటానని చెప్పడం.. ఆ వీడియోలో వినొచ్చు. మరోవైపు, కౌశిక్ రెడ్డి కి తెలంగాణ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నోటీసులపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో 24 గంటల్లో హుజూరాబాద్ తెరాస అభ్యర్థి ఎవరు ? అన్నది తేలిపోనుంది. కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై కౌశిక్ రెడ్డి రెడ్డి స్పందనని బట్టీ.. ఆ విషయం అర్థమవుతోందని చెప్పుకుంటున్నారు.