మహేష్ తో మణిరత్నం సినిమా.. నిజమెంత ?

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో బిజీగా ఉన్న మహేశ్‌బాబు ఆ తర్వాత రాజమౌళితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కలిసి ఓ సినిమా చేయబోతున్నారట మహేష్. మొదట్లో పుకారుగా అనిపించినా.. చివరికి నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మణిరత్నం ఒక కథ కూడా మహేశ్‌కు వినిపించారు. ఈ విషయాన్ని స్వయంగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే సినిమాకు మహేశ్‌బాబు పచ్చ జెండా ఊపారా..? లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే.. త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మణిరత్నం చెప్పుకొచ్చారు. అది మహేష్ సినిమానే అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.