కాళ్లు లేని జవాన్ పాత్రలో నాని

నేచురల్ స్టార్ నాని మరో ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారమ్. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం గౌతమ్ ‘జెర్సీ’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత మరోసారి నానితో జతకట్టబోతున్నట్టు సమాచారమ్. మరో ఎమోషనల్ స్టోరీని చేయబోతున్నారట.

ఇది ఓ జవాన్ బయోపిక్ అని తెలుస్తోంది. కాళ్లు లేని ఓ జవాన్ లైఫ్ స్టోరీ చూపించబోతున్నారట. ఇప్పటికే నానికి కథ కూడా చెప్పాడట. ఈ యేడాది ఆఖరులో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. నాని నటించిన టక్ జగదీష్ రిలీజ్ కి రెడీగా ఉంది. మరో సినిమా శ్యామ్ సింగరాయ్ ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాల తర్వాత నాని చేయబోయే సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ఉండనుందని తెలుస్తోంది.