అప్పుడు ఓడిన వారికి.. ఇప్పుడు పదవులు

ఏపీలో నామినేటెడ్ పదవుల పండగ మొదలు కానుంది. ప్రస్తుతం సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించనున్నారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ఓడిన 24మందికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కనున్నట్లు సమాచారమ్.
మొత్తం మీద 175 నియోజకవర్గాల్లోనూ వైకాపాకు చెందిన వారు ప్రొటోకాల్ పదవిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో రాజకీయ సమీకరణల దృష్ట్యా టికెట్ పొందలేకపోయిన వారికీ ఇప్పుడు పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు.