రజనీ పొలిటికల్ ఎంట్రీ.. అభిమానులతో మళ్లీ మీటింగ్ !

సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఇక ముగిసిన అధ్యయమే అనుకున్నారు. కానీ ‘పిచ్చర్ అభీ బాకీ హై మేరా దోస్ట్’ అంటున్నాడు రజనీ. తాజాగా రజనీ అభిమానులతో సమావేశం అయ్యారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం మొదలైంది. సమావేశానికి ముందు రజనీ మీడియాతో మాట్లాడారు.

ఇంకా అభిమానులు పొలిటికల్ ఎంట్రీపై అడుగుతున్నారు. ఈ సమావేశంలో పొలిటికల్ ఎంట్రీపై చర్చిస్తాం. సమావేశం తర్వాత అన్నీ విషయాలు చెబుతా అన్నారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే రజనీ పొలిటిల్ ఎంట్రీ ఇవాల్సి ఉంది. ఎన్నికల్లో పోటికి దిగాల్సి ఉంది. ఇందుకోసం రజనీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. 2020 డిసెంబర్ 31న పార్టీ ప్రకటన.. ఆ వెంటనే జెండా, ఎజెండాలని ప్రకటిస్తానని తెలిపారు.

ఇంతలో రజనీ అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. కోలుకున్న తర్వాత.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని పెట్టలేనని ప్రకటించారు. దీంతో.. ఇక రజనీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పటికీ ఉండదని ఆయన అభిమానులు ఫిక్స్ అయిపోయారు. 
అయితే వారి అంచనాలు తలక్రిందులు చేస్తూ.. రజనీ మరోసారి అభిమానులతో సమావేశం అయ్యారు.

అంతేకాదు.. ఇంకా అభిమానులు పొలిటికల్ ఎంట్రీ గురించి అడుగుతున్నారు. ఈ సమావేశంలో దానిపై చర్చిస్తామని స్వయంగా రజనీనే చెప్పడం విశేషం. వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవలే రజనీ అమెరికా వెళ్లొచ్చారు. వెళ్లొచ్చిన వెంటనే రజనీ పొలిటికల్ ఎంట్రీపై మీటింగ్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవుడు ఆదేశిస్తే.. తాను చేస్తానని రజనీ చెప్ప్తుంటాడు. బహుశా.. పొలిటికల్ ఎంట్రీపై రజనీకి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేరేమో.. !

Fans welcoming #Thalaivar #Superstar #Rajinikanth at Raghavendra Mandapam earlier today. #ThalaivarLatest #RajiniMakkalMandram pic.twitter.com/GytDxvdrbM— Praveen R (@Praveen_RMM) July 12, 2021

#Thalaivar #Superstar #Rajinikanth‘s Pre-press meet Fans welcome earlier this morning. #ThalaivarLatest #RajiniMakkalMandram pic.twitter.com/6jt9ZSdV2l— Praveen R (@Praveen_RMM) July 12, 2021