పొలిటికల్ రీ-ఎంట్రీపై రజనీ ప్రకటన

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఈరోజు తమిళనాడులోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ తన అభిమాన సంఘంతో కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఇదంతా రజనీ పొలిటికల్ రీ-ఎంట్రీ కోసమే అనే ప్రచారం జరిగింది. ఈ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన రజనీ.. ఇంకా అభిమానులు రాజకీయాల్లోకి రమ్మంటున్నారు. తాజా సమావేశంలో పొలిటికల్ ఎంట్రీపై చర్చిస్తాం. ఓ నిర్ణయం తీసుకుంటాం. సమావేశం అనంతరం అన్నీ విషయాలు చెబుతా అన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సమావేశంపై అందరి ఫోకస్ పడింది. అయితే ఎప్పటిలాగే రజనీ నో పొలిటిక్స్ అన్నారు. రాజకీయాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తను రాజకీయాల్లోకి రానని, భవిష్యత్తులో కూడా ఇటువైపు అడుగుపెట్టనని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు.. తన పార్టీ మక్కల్ మండ్రంని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక మీదట తన అభిమాన సంఘాల పేరుతోనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు రజనీకాంత్. ఇకపై తన పొలిటికల్ ఎంట్రీపై అభిమానులు ఆశపడకుండా, మాట్లాడకుండా రజనీ స్పష్టత ఇచ్చారు. ఇకపై రజనీ నో పాలిటిక్స్.. ఓన్లీ సేవ మాత్రమే.


