ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం
కరోనా నిబంధనలని ఏపీ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. మాస్క్ లు ధరించిన వారిపై కఠిన చర్యలకి ఆదేశించింది. మాస్క్ లేకుంటే రూ. 100 జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనని కచ్చితంగా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది.
మాస్క్ నిబంధనని ఎవరైనా ఉల్లఘిస్తే.. ఫోటో తీసి పంపాలని.. ఇలా పంపినా జరిమానాలు విధిస్తామని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ని ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోందని.. ఎక్కడ ప్రజలు గుమికూడదని హెచ్చరించింది. మొత్తానికి.. కరోనా తిరిగి విజృంభించకుండా ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.