కత్తి మహేష్ మృతిపై అనుమానాలు.. ఆక్సిజన్ పైప్ పీకేశారా ?

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ కన్నుమూశారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. అయితే ఆయన మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. కత్తి మహేష్ మృతి చెందడానికి ముందు ఆక్సిజన్ పైప్ పీకేశారని.. వెంటిలేటర్ పై తొలగించారనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంలో నిజమెంత ? అసలు ఏం జరిగింది ? తెలియాలంటే.. వైద్యుల నివేదిక రావాల్సిందే. ఇక కత్తి మహేష్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం.. ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. ఈ మేరకు కత్తి మహేష్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కొందరు కత్తి మహేశ్ మిత్రులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది.