వెంకయ్యని కలిసిన విశాల్

కోలీవుడ్ హీరో విశాల్ ఆదివారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిశారు. తన సోదరితో పాటు వెళ్లి ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్ పలు అంశాలను ఆయనతో చర్చించారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని విశాల్ పంచున్నారు.కయ్యనాయుడుతో కలిసి దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు.
వెంకయ్య నాయుడుతో విలువైన సమయం గడిపా, ఆయనతో మాట్లాడటం ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటుంది. సమాజ సేవ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు గురించి ఆయనతో మాట్లాడా. ఆయనకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా’నని ట్విట్ చేశారు.