‘అఖండ’ కొత్త పోస్టర్.. కేక !

బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. 2021 లో స్టార్ట్ అయిన క్రేజీ ప్రాజెక్టుల్లో అఖండ ఒకటి. కరోనా కారణంగా డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టు లేటెస్ట్ షెడ్యూలు సోమవారం ప్రారంభమైంది. అఘోరా ‘అఖండ’ గెటప్ లో బాలయ్య సెట్ మీదకు వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. సెట్స్ నుంచి ఓ స్టిల్ ని పంచుకుండి. ఈ స్టిల్ లో బాలయ్య కొంచెం లావుగా, బలంగా కనిపిస్తున్నాడు. 

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయ్. అఖండ.. అంతకుమించి ఉండేలా బాలయ్య ప్లాన్ చేశాడని చెబుతున్నారు. ఇక అఖండ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండనుంది.