సోషల్ మీడియాలో టాప్.. ఈ ముద్దుగుమ్మలే !
సోషల్ మీడియాను ఏలుతున్న బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు ? ఈ అంశం గురించి ఆర్మాక్స్ మీడియా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సోషల్ మీడియాలో బాగా ప్రేమను పొందుతున్న బాలీవుడ్ హీరోయిన్ల జాబితాను ఆ సర్వే కంపెనీ విడుదల చేసింది.
ఈ సర్వే ప్రకారం.. దీపికా పదుకునే చెక్కుచెదరని ఆదరణతో తొలి స్థానంలో నిలుస్తోంది. అలియా భట్ రెండో స్థానంలో ఉంది. తనకు సంబంధించి పిక్స్ ను, వీడియోలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తూ.. తన ఫాలోయర్లకు అనునిత్యం ట్రీట్ ను ఇస్తోంది అలియా. సమ్మోహన శక్తి కలిగిన తార కత్రినా కైఫ్ మూడో స్థానంలో ఉంది.
నాలుగో స్థానంలో ఉంటూ తన ఉనికిని చాటుకుంటోంది శ్రద్ధా కపూర్. ఇక తన హాట్ కామెంట్స్ తో కూడా వార్తల్లో నిలిచే తాప్సీ ఐదో స్థానంలో ఉంది. ఇక సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన ప్రియాంక చెప్రా, దిశా పటానీ, కరీనా కపూర్.. నెటిజన్స్ ప్రేమని పొందడంలో టాప్-5లో ఉండలేకపోయారు.