పార్టీ మార్పుపై రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ
మునుగోడు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారుతున్న గతంలోనే వార్తలొచ్చాయ్. బీజేపీలో చేరుతా. కార్యకర్తల చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్వయంగా రాజగోపాల్ రెడ్డినే తెలిపారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయితే ఆయన మనసు మాత్రం కమలం పైనే ఉంది. అది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన తనకు లేదని తాజాగా రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. “తెలంగాణ ఇచ్చినప్పటికీ నాయకత్వం లోపం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. నిర్ణయలోపంతో పార్టీ బలహీన పడిందని, భాజపా బలపడిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎంపికపై పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడదలుచుకోలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఇప్పట్లో పార్టీ మారనని క్లారిటీ ఇచ్చారు.