నీ భార్యని వదిలేస్తే.. ఎమ్మెల్యే అవుతావ్.. చివరికి బాబా అరెస్ట్ !
రాజకీయ నాయకులకు, రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి మూఢ నమ్ముకాలు ఎక్కువ. పూజలు, వ్రతాలు, యాగాలు చేస్తారు. మరికొందరు బాబాలని ఆశ్రయిస్తారు. వారు చెప్పినట్టు చేస్తారు. ఆ మూఢ నమ్మకాలు అనర్థాలకు దారితీస్తాయి. తాజాగా పుణెలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. రఘునాథ్ రాజారామ్ ఎమూల్(48)కి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక. దీంతో బాబాల బాట పడ్డాడు. ఇక ఆ బాబా.. నీ భార్యని వదిలిస్తే..కచ్చితంగా ఎమ్మెల్యే, మంత్రిపదవులు వస్తాయని.. ఆమెతో కలిసి ఉన్నంతకాలం ఏ పదవీ దక్కదు అని చెప్పాడు.
ఆ బాబా మాటలు మనసులు పెట్టుకొన్న రాజారామ్ ఎమూల్ భార్యని వదిలించుకునేందుకు రెడీ అయ్యాడు. ఆమెను ప్రతిరోజు చిత్రహింసలు పెట్టేవాడు. కట్నం కోసం వేధించేవాడు. సిగరేట్ తో కాల్చేవాడు. ఇక ఓపిక నశించిన అతని భార్య(27) పోలీసులని ఆశ్రయించింది. విచారణలో ఆమె భర్త షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. బాబా చెప్పినట్టే ప్రవర్తించానని చెప్పాడు. దీంతో పోలీసులు బాబాని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.