కౌశిక్‌రెడ్డిపై రూ.కోటి పరువు నష్టం దావా

కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పోతూ.. పోతూ.. కాంగ్రెస్ పార్టీ, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని.. మాణికం ఠాగూర్‌ డబ్బులు తీసుకొని సీనియర్లను కాదని రేవంత్‌కు పీసీసీ కట్టబెట్టారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

ఈ ఆరోపణలపై మాణికం ఠాగూర్‌ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కౌశిక్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు ఇచ్చారు. ఈ నిరాధార ఆరోపణలు.. తన పరువుకు తీవ్ర భంగం కలిగించాయని మాణికం ఠాగూర్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో రాతపూర్వకంగా బేషరతుగా కౌశిక్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని.. రూ.కోటి పరువు నష్టం దావా వేయనున్నట్లు ఠాగూర్‌ హెచ్చరించారు.

ఇక కౌశిక్‌రెడ్డి కామెంట్స్ స్పందించిన రేవంత్ రెడ్డి.. కౌశిక్‌రెడ్డి చిన్న పిల్లవాడు. ఆ మాటలు అతనివి కావు. సీఎం కేసీఆర్‌ మాట్లాడించినవి అన్నారు. కౌశిక్‌ రెడ్డి తెరాసతో టచ్‌లో ఉన్న విషయం నాకు ముందే తెలుసు.ప్రస్తుతం హుజూరాబాద్‌లో తెరాసకు సరైన అభ్యర్థి లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారని రేవంత్ అన్నారు.