రామారావు సెగ తప్పింది
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల టైటిల్స్ మెగా హీరోలు మాత్రమే వాడుకోవాలి. లేదంటే మెగా అభిమానులకు కోపం వస్తుంది. ఫైర్ అవుతారు. గతంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెడితే మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. గ్యాంగ్ లీడర్ టైటిల్ ని వాడుకునేంత రేంజ్ నానికి లేదని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారు. ఈ ఎఫెక్ట్ నో లేక ఇతర కారణాలో తెలీదు. కానీ గ్యాంగ్ లీడర్ టైటిల్ ని కాస్త నాని ‘గ్యాంగ్ లీడర్’గా మార్చారు.
ఇలాంటి సీన్ ఒకటి నందమూరి ఫ్యాన్స్ రిపీట్ చేస్తారు అనుకున్నారు. ఎందుకంటే ? “రామారావు” టైటిల్ బాలయ్య కోసం ప్రచారం జరిగింది. బాలయ్య వందో సినిమా కోసం అనిల్ రావిపూడి రెడీ చేసిన కథకు రామారావు టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడీ.. ఈ టైటిల్ ని రవితేజ కొట్టేశాడు. ఆయన చిత్రానికి ‘రామారావు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఆన్ డ్యూటీ అనేది ఉపశీర్షిక. ఈ నేపథ్యంలో రవితేజ పై నందమూరి, బాలయ్య అభిమానులు ఫైర్ అవుతారు అనుకున్నారు. కానీ నందమూరి అభిమానులు చాలా పెద్ద మనసు ప్రదర్శించారు. రవితేజ కానీ, చిత్రబృందాన్ని గానీ ఒక్క మాట అనలేదు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ విభిన్నమైన థ్రిల్లర్‌గా ‘రామారావు’ రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ చిత్రానికి ఎంఆర్వో టైటిల్ అనుకున్నారు. అనూహ్యంగా రామారావు టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. రామారావు హిట్ అయితే.. రవితేజ ఫ్యాన్స్ తో పాటు నందమూరి అభిమానులు సంతోషిస్తారు.